నిర్గమకాండము 34:15ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
సంఖ్యాకాండము 25:1అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.
1 రాజులు 16:31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
1 రాజులు 17:4ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
1 రాజులు 17:13అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
1 రాజులు 19:1ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
1 రాజులు 21:7అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
1 రాజులు 21:23మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగాయెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
2 రాజులు 9:7కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.
2 రాజులు 9:30యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా
అపొస్తలుల కార్యములు 15:20విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
అపొస్తలుల కార్యములు 15:29ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
1 కొరింథీయులకు 8:10ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
1 కొరింథీయులకు 10:18శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?
1 కొరింథీయులకు 10:28అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
ప్రకటన గ్రంథము 2:4అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.