Home ప్రకటన గ్రంథము 16:15 · తెలుగు బైబిల్

ప్రకటన గ్రంథము

Chapter 16 · Verse 15

తెలుగు బైబిల్

ప్రకటన గ్రంథము 16:15

హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.

Book: Revelation · Chapter: 16 · Verse: 15

Cross References

నిర్గమకాండము 32:25

ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచి పెట్టి యుండెను.

యెషయా 47:3

నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

యెహెజ్కేలు 16:37

నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.

హోషేయ 2:3

మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;

హబక్కూకు 2:15

తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.

మత్తయి 24:42

కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

మత్తయి 25:13

ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

మత్తయి 26:41

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి

మార్కు 13:33

జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.

మార్కు 14:38

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి

లూకా 12:37

ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

లూకా 21:36

కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 20:31

కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.

2 కొరింథీయులకు 5:3

ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.

1 థెస్సలొనీకయులకు 5:2

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

1 థెస్సలొనీకయులకు 5:6

కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme