Home కీర్తనలు 9:14 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 9 · Verse 14

తెలుగు బైబిల్

కీర్తనలు 9:14

మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.

Book: Psalm · Chapter: 9 · Verse: 14

Cross References

నిర్గమకాండము 3:7

మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.

నిర్గమకాండము 3:9

ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.

1 సమూయేలు 2:1

మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.

కీర్తనలు 6:3

నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?

కీర్తనలు 13:5

నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది

కీర్తనలు 20:5

యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

కీర్తనలు 21:1

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.

కీర్తనలు 22:22

నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

కీర్తనలు 22:25

మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

కీర్తనలు 35:9

అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

కీర్తనలు 35:18

అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

కీర్తనలు 42:4

జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.

కీర్తనలు 51:12

నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

కీర్తనలు 51:15

ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.

కీర్తనలు 75:9

నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.

కీర్తనలు 79:13

అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme