కీర్తనలు 77:13
దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
కీర్తనలు 77:13
దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు?
నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.
మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.