Home కీర్తనలు 74:12 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 74 · Verse 12

తెలుగు బైబిల్

కీర్తనలు 74:12

పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.

Book: Psalm · Chapter: 74 · Verse: 12

Cross References

నిర్గమకాండము 15:2

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

నిర్గమకాండము 19:5

కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.

సంఖ్యాకాండము 23:21

ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.

న్యాయాధిపతులు 4:23

ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనాను రాజైన యాబీనును అణచెను.

1 సమూయేలు 19:5

అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

కీర్తనలు 5:3

యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

కీర్తనలు 44:4

దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.

యెషయా 33:22

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

యెషయా 63:8

వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

యిర్మియా 10:10

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

హబక్కూకు 1:12

యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

హబక్కూకు 3:12

బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు

అపొస్తలుల కార్యములు 7:7

మరియు దేవుడు ఏ జనము నకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోటనన్ను సేవింతురనియు చెప్పెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme