Home కీర్తనలు 62:3 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 62 · Verse 3

తెలుగు బైబిల్

కీర్తనలు 62:3

ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ ద్రోయ చూచుదురు?

Book: Psalm · Chapter: 62 · Verse: 3

Cross References

నిర్గమకాండము 10:3

కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

నిర్గమకాండము 16:28

అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను - మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

1 సమూయేలు 26:10

యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;

కీర్తనలు 4:2

నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

కీర్తనలు 16:8

సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.

కీర్తనలు 18:3

కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.

కీర్తనలు 21:11

వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురు పాయము పన్నిరికాని దానిని కొనసాగింప లేకపోయిరి.

కీర్తనలు 38:12

నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

కీర్తనలు 73:18

నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

కీర్తనలు 82:2

ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా. )

కీర్తనలు 125:1

యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

కీర్తనలు 140:2

వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.

సామెతలు 1:22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?

సామెతలు 6:9

సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

యెషయా 30:13

ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

యిర్మియా 4:14

యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme