Home కీర్తనలు 6:10 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 6 · Verse 10

తెలుగు బైబిల్

కీర్తనలు 6:10

నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

Book: Psalm · Chapter: 6 · Verse: 10

Cross References

2 రాజులు 20:5

నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.

యోబు 6:29

అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

కీర్తనలు 2:5

ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును

కీర్తనలు 5:10

దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.

కీర్తనలు 7:6

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

కీర్తనలు 21:8

నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.

కీర్తనలు 25:3

నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.

కీర్తనలు 35:26

నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

కీర్తనలు 40:14

నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

కీర్తనలు 55:20

తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

కీర్తనలు 71:13

నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.

కీర్తనలు 71:24

వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

కీర్తనలు 73:19

క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

కీర్తనలు 83:16

యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.

కీర్తనలు 86:17

యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.

కీర్తనలు 109:28

వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme