Home కీర్తనలు 55:1 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 55 · Verse 1

తెలుగు బైబిల్

కీర్తనలు 55:1

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

Book: Psalm · Chapter: 55 · Verse: 1

Cross References

కీర్తనలు 5:1

యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

కీర్తనలు 6:1

యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

కీర్తనలు 17:1

యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.

కీర్తనలు 27:9

నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

కీర్తనలు 28:1

యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.

కీర్తనలు 54:1

దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.

కీర్తనలు 61:1

దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

కీర్తనలు 64:1

దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.

కీర్తనలు 80:1

ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

కీర్తనలు 80:4

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు?

కీర్తనలు 84:8

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా. )

కీర్తనలు 86:6

యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,

కీర్తనలు 143:7

యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము

విలాపవాక్యములు 3:8

నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.

విలాపవాక్యములు 3:56

నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.

1 పేతురు 3:12

ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme