కీర్తనలు 54:4
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
కీర్తనలు 54:4
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.
యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.
నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?
నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?
కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.