కీర్తనలు 52:6
నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి
కీర్తనలు 52:6
నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి
మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.
మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు
యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయు చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
కన్ను లార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.
ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;
పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.