కీర్తనలు 49:11
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
కీర్తనలు 49:11
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.
ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.
తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షా లోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.
వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నింతురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము.
జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని.
ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.
ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును,
అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది.
కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.