Home కీర్తనలు 46:2 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 46 · Verse 2

తెలుగు బైబిల్

కీర్తనలు 46:2

కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను

Book: Psalm · Chapter: 46 · Verse: 2

Cross References

ఆదికాండము 7:11

నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.

2 సమూయేలు 22:3

నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.

కీర్తనలు 18:7

అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.

కీర్తనలు 23:4

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

కీర్తనలు 27:3

నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.

కీర్తనలు 28:7

యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

కీర్తనలు 37:39

బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక

కీర్తనలు 59:17

దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను.

కీర్తనలు 62:8

జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )

కీర్తనలు 62:9

అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

కీర్తనలు 82:5

జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.

కీర్తనలు 91:2

ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.

కీర్తనలు 142:6

నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.

యిర్మియా 14:8

ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;

నహూము 1:7

యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.

మత్తయి 8:24

అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme