Home కీర్తనలు 41:6 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 41 · Verse 6

తెలుగు బైబిల్

కీర్తనలు 41:6

ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.

Book: Psalm · Chapter: 41 · Verse: 6

Cross References

నెహెమ్యా 6:1

నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని

కీర్తనలు 12:2

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

సామెతలు 26:24

పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.

యిర్మియా 20:10

నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.

దానియేలు 11:27

కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.

మీకా 7:5

స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.

లూకా 11:53

ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి,

లూకా 20:20

వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.

2 కొరింథీయులకు 11:26

అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme