కీర్తనలు 4:8
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
కీర్తనలు 4:8
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.
మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువు లందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు
శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.
మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును.
ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశ ములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివ సింపజేయుదును.
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.
అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.