Home కీర్తనలు 20:3 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 20 · Verse 3

తెలుగు బైబిల్

కీర్తనలు 20:3

ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక.

Book: Psalm · Chapter: 20 · Verse: 3

Cross References

ఆదికాండము 4:4

హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను;

లేవీయకాండము 9:24

యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.

1 దినవృత్తాంతములు 21:26

పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

2 దినవృత్తాంతములు 7:1

సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతర మైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మంది రమునిండ నిండెను,

కీర్తనలు 51:19

అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు.

కీర్తనలు 128:5

సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

కీర్తనలు 134:3

భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.

యెషయా 60:7

నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

అపొస్తలుల కార్యములు 10:4

అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

ఎఫెసీయులకు 5:2

క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

1 పేతురు 2:5

యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme