Home కీర్తనలు 17:5 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 17 · Verse 5

తెలుగు బైబిల్

కీర్తనలు 17:5

నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

Book: Psalm · Chapter: 17 · Verse: 5

Cross References

1 సమూయేలు 2:9

తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

యోబు 23:11

నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.

కీర్తనలు 18:36

నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

కీర్తనలు 18:37

నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

కీర్తనలు 38:16

ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.

కీర్తనలు 44:18

మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

కీర్తనలు 94:18

నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

కీర్తనలు 119:116

నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.

కీర్తనలు 119:133

నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

కీర్తనలు 121:3

ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

కీర్తనలు 121:7

ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును

యిర్మియా 10:23

యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme