Home కీర్తనలు 147:15 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 147 · Verse 15

తెలుగు బైబిల్

కీర్తనలు 147:15

భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.

Book: Psalm · Chapter: 147 · Verse: 15

Cross References

యోబు 34:29

ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే

యోబు 37:12

ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును

కీర్తనలు 33:9

ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

కీర్తనలు 68:11

ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.

కీర్తనలు 107:20

ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.

కీర్తనలు 107:25

ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

యోనా 1:4

అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.

మత్తయి 8:8

ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.

మత్తయి 8:13

అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.

2 థెస్సలొనీకయులకు 3:1

తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme