కీర్తనలు 147:13
ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.
కీర్తనలు 147:13
ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.
ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురము వరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.
నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని
నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.
నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
మా కుమారులు తమ ¸యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.
నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే,
సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతిం చుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గు చున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.