Home కీర్తనలు 144:7 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 144 · Verse 7

తెలుగు బైబిల్

కీర్తనలు 144:7

పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము.

Book: Psalm · Chapter: 144 · Verse: 7

Cross References

2 సమూయేలు 22:17

ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెనునన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

నెహెమ్యా 9:2

ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.

కీర్తనలు 18:16

ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

కీర్తనలు 18:17

బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

కీర్తనలు 18:44

నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు

కీర్తనలు 54:3

అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా. )

కీర్తనలు 69:1

దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

కీర్తనలు 69:14

నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.

కీర్తనలు 93:3

వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి

కీర్తనలు 124:4

జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును

కీర్తనలు 144:11

నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్నువిడి పింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.

మలాకీ 2:11

యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.

మత్తయి 27:43

వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

ప్రకటన గ్రంథము 12:15

కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని

ప్రకటన గ్రంథము 17:15

మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme