కీర్తనలు 143:9
యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
కీర్తనలు 143:9
యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.
యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.
మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.
నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.