Home కీర్తనలు 140:5 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 140 · Verse 5

తెలుగు బైబిల్

కీర్తనలు 140:5

గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా. )

Book: Psalm · Chapter: 140 · Verse: 5

Cross References

యోబు 18:9

బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.

కీర్తనలు 10:4

దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

కీర్తనలు 17:8

నీ కృపాతిశయములను చూపుము.

కీర్తనలు 31:4

నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.

కీర్తనలు 35:7

నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

కీర్తనలు 36:11

గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.

కీర్తనలు 43:1

దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

కీర్తనలు 57:6

నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా. )

కీర్తనలు 119:69

గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.

కీర్తనలు 119:85

నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.

కీర్తనలు 119:110

నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.

కీర్తనలు 123:3

యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.

కీర్తనలు 141:9

నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.

కీర్తనలు 142:3

నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.

సామెతలు 24:15

భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

సామెతలు 29:5

తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme