Home కీర్తనలు 134:2 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 134 · Verse 2

తెలుగు బైబిల్

కీర్తనలు 134:2

పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.

Book: Psalm · Chapter: 134 · Verse: 2

Cross References

నెహెమ్యా 8:6

ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి.

కీర్తనలు 26:6

నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.

కీర్తనలు 28:2

నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.

కీర్తనలు 63:2

నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

కీర్తనలు 63:4

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

కీర్తనలు 63:5

క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది

కీర్తనలు 141:2

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

విలాపవాక్యములు 2:19

నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు

విలాపవాక్యములు 3:41

ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.

1 తిమోతికి 2:8

కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme