Home కీర్తనలు 119:32 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 119 · Verse 32

తెలుగు బైబిల్

కీర్తనలు 119:32

నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.

Book: Psalm · Chapter: 119 · Verse: 32

Cross References

ఆదికాండము 26:22

అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.

1 రాజులు 4:29

దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

యోబు 36:15

శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.

కీర్తనలు 18:36

నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

కీర్తనలు 119:45

నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును

పరమగీతము 1:4

నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు.

యెషయా 40:31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

యెషయా 60:5

నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

లూకా 1:74

అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

యోహాను 8:32

అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

యోహాను 8:36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

1 కొరింథీయులకు 9:24

పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

2 కొరింథీయులకు 3:17

ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

2 కొరింథీయులకు 6:11

ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.

హెబ్రీయులకు 12:1

ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme