Home కీర్తనలు 116:16 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 116 · Verse 16

తెలుగు బైబిల్

కీర్తనలు 116:16

యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

Book: Psalm · Chapter: 116 · Verse: 16

Cross References

1 దినవృత్తాంతములు 17:19

యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.

2 దినవృత్తాంతములు 33:11

కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొని పోయిరి.

కీర్తనలు 86:16

నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.

కీర్తనలు 107:14

వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.

కీర్తనలు 119:125

నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము

కీర్తనలు 143:12

నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింప జేయుము.

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

యోహాను 12:26

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

అపొస్తలుల కార్యములు 27:23

నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;

రోమీయులకు 6:22

అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme