Home కీర్తనలు 112:9 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 112 · Verse 9

తెలుగు బైబిల్

కీర్తనలు 112:9

వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.

Book: Psalm · Chapter: 112 · Verse: 9

Cross References

ద్వితీయోపదేశకాండము 15:11

బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.

ద్వితీయోపదేశకాండము 15:14

నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.

ద్వితీయోపదేశకాండము 24:13

అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.

1 సమూయేలు 2:1

మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.

1 సమూయేలు 2:30

నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.

కీర్తనలు 75:10

భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.

కీర్తనలు 92:10

గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.

కీర్తనలు 92:11

నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను

కీర్తనలు 111:3

ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

కీర్తనలు 112:3

కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.

సామెతలు 11:24

వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

సామెతలు 14:24

జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.

సామెతలు 19:17

బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

సామెతలు 21:26

దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.

ప్రసంగి 3:6

వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

ప్రసంగి 11:1

నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినము లైన తరువాత అది నీకు కనబడును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme