Home కీర్తనలు 106:35 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 106 · Verse 35

తెలుగు బైబిల్

కీర్తనలు 106:35

అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

Book: Psalm · Chapter: 106 · Verse: 35

Cross References

ద్వితీయోపదేశకాండము 12:30

వారి దేవతలను ఆశ్ర యింపగోరిఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండ వలెను.

యెహోషువ 15:63

యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

న్యాయాధిపతులు 1:27

మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.

న్యాయాధిపతులు 2:2

మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు.

న్యాయాధిపతులు 3:5

కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు

న్యాయాధిపతులు 3:7

అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి.

న్యాయాధిపతులు 8:27

కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.

సామెతలు 22:25

నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

యెషయా 2:6

యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

హోషేయ 7:8

ఎఫ్రా యిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.

1 కొరింథీయులకు 5:6

మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?

1 కొరింథీయులకు 15:33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme