కీర్తనలు 106:23
అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
కీర్తనలు 106:23
అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.
తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
మరియు యెహోవానేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను.
కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలు వది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవామిమ్మును నశింపజేసెదననగా
నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.
నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పులను జ్ఞాపకముచేసికొనుడి
ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.
యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.
యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచు నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.
అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.