కీర్తనలు 104:7
నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
కీర్తనలు 104:7
నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను.
సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.
ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.