Home కీర్తనలు 102:16 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 102 · Verse 16

తెలుగు బైబిల్

కీర్తనలు 102:16

ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను

Book: Psalm · Chapter: 102 · Verse: 16

Cross References

కీర్తనలు 51:18

నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.

కీర్తనలు 69:35

దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.

కీర్తనలు 97:6

ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

కీర్తనలు 147:2

యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు

యెషయా 2:2

అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యెషయా 14:26

సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

యెషయా 59:19

పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.

యెషయా 60:1

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

యెషయా 60:3

జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

యెషయా 60:7

నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

యెషయా 61:3

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

యెషయా 66:18

వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

యిర్మియా 31:4

ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.

యిర్మియా 33:7

చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.

మీకా 2:9

వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.

జెకర్యా 2:6

ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme