సామెతలు 9:3
తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
సామెతలు 9:3
తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది
జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది
అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.
జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.
అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజ మానుడు కోపపడినీవు త్వరగాపట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.