Home సామెతలు 7:21 · తెలుగు బైబిల్

సామెతలు

Chapter 7 · Verse 21

తెలుగు బైబిల్

సామెతలు 7:21

అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.

Book: Proverbs · Chapter: 7 · Verse: 21

Cross References

న్యాయాధిపతులు 14:17

ఏడవదినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.

న్యాయాధిపతులు 16:15

అప్పుడు ఆమెనాయందు నీకిష్టము లేనప్పుడునేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.

1 సమూయేలు 28:23

అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను.

2 రాజులు 4:8

ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.

నెహెమ్యా 6:4

వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని.

కీర్తనలు 12:2

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

సామెతలు 5:3

జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

సామెతలు 6:24

చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

సామెతలు 7:5

అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.

లూకా 14:23

అందుకు యజమానుడు - నా యిల్లు నిండు నట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;

లూకా 24:29

వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

అపొస్తలుల కార్యములు 16:15

ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె - నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

2 కొరింథీయులకు 5:14

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme