Home సామెతలు 22:18 · తెలుగు బైబిల్

సామెతలు

Chapter 22 · Verse 18

తెలుగు బైబిల్

సామెతలు 22:18

నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.

Book: Proverbs · Chapter: 22 · Verse: 18

Cross References

యోబు 32:18

నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

కీర్తనలు 19:10

అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.

కీర్తనలు 119:13

నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.

కీర్తనలు 119:103

నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

కీర్తనలు 119:111

నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

కీర్తనలు 119:162

విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.

కీర్తనలు 119:171

నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును

సామెతలు 2:10

జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును

సామెతలు 3:17

దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.

సామెతలు 4:20

నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.

సామెతలు 4:21

నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.

సామెతలు 8:6

నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

సామెతలు 10:13

వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.

సామెతలు 10:21

నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.

సామెతలు 15:7

జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు

సామెతలు 16:21

జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme