సామెతలు 20:4
విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.
సామెతలు 20:4
విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.
ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు
బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.
సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును.
గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.
బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగు దును
ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.