Home సామెతలు 12:16 · తెలుగు బైబిల్

సామెతలు

Chapter 12 · Verse 16

తెలుగు బైబిల్

సామెతలు 12:16

మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.

Book: Proverbs · Chapter: 12 · Verse: 16

Cross References

1 సమూయేలు 20:30

సౌలు యోనా తానుమీద బహుగా కోపపడి - ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి నది కాదా?

1 రాజులు 19:1

ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా

సామెతలు 10:12

పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.

సామెతలు 14:33

తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును

సామెతలు 16:22

తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష

సామెతలు 17:9

ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.

సామెతలు 25:28

ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

సామెతలు 29:11

బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.

యాకోబు 1:19

నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme