Home సామెతలు 10:20 · తెలుగు బైబిల్

సామెతలు

Chapter 10 · Verse 20

తెలుగు బైబిల్

సామెతలు 10:20

నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.

Book: Proverbs · Chapter: 10 · Verse: 20

Cross References

ఆదికాండము 6:5

నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.

కీర్తనలు 37:30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

సామెతలు 8:19

మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.

సామెతలు 12:18

కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

సామెతలు 15:4

సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

సామెతలు 16:13

నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.

సామెతలు 20:15

బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

సామెతలు 23:7

అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

సామెతలు 25:11

సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.

యిర్మియా 17:9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

మత్తయి 12:34

సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme