సంఖ్యాకాండము 6:6
అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.
సంఖ్యాకాండము 6:6
అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.
చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.
అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననే గాని తన తల్లి శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.
దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను
ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అప విత్రుడై యుండును.
ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.
బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు
నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.
శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను
కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.