Home సంఖ్యాకాండము 6:10 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 6 · Verse 10

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 6:10

ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని యొద్దకు తేవలెను.

Book: Numbers · Chapter: 6 · Verse: 10

Cross References

లేవీయకాండము 1:14

అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావు రపు పిల్లలలో నుండిగాని తేవలెను.

లేవీయకాండము 5:7

అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

లేవీయకాండము 9:1

ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారు లను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి

లేవీయకాండము 12:6

కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.

లేవీయకాండము 14:22

వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.

లేవీయకాండము 14:31

తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజ కుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.

లేవీయకాండము 15:14

ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.

లేవీయకాండము 15:29

ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.

యెహెజ్కేలు 44:26

ఒకడు అంటుపడి శుచిర్భూéతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి

యోహాను 2:1

మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.

రోమీయులకు 4:25

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme