Home సంఖ్యాకాండము 21:4 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 21 · Verse 4

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 21:4

వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

Book: Numbers · Chapter: 21 · Verse: 4

Cross References

నిర్గమకాండము 6:9

మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.

సంఖ్యాకాండము 14:25

అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.

సంఖ్యాకాండము 20:18

ఎదోమీ యులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా

సంఖ్యాకాండము 20:21

ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్దనుండి తొలగిపోయిరి.

సంఖ్యాకాండము 20:27

యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.

సంఖ్యాకాండము 32:7

యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు?

సంఖ్యాకాండము 32:9

వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లక పోయిరి.

సంఖ్యాకాండము 33:41

వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

ద్వితీయోపదేశకాండము 1:40

మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.

ద్వితీయోపదేశకాండము 2:5

వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చి యున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.

న్యాయాధిపతులు 11:18

తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.

2 రాజులు 3:8

మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడుఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 14:22

శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

1 థెస్సలొనీకయులకు 3:3

మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme