సంఖ్యాకాండము 15:20
మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.
సంఖ్యాకాండము 15:20
మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.
నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.
ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.
నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్య మును చేయు నప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుమునేను మీ కిచ్చు చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
మీరు మీ దేవునికి అర్ప ణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.
యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామ మునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి
ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.
నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
మీ ప్రతిష్ఠి తార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటి లోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.