2 సమూయేలు 15:10అబ్షాలోముమీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీ యుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.
1 రాజులు 1:7అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని
1 రాజులు 1:18ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.
1 రాజులు 1:25ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచురాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు.
1 రాజులు 1:34యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.
నెహెమ్యా 6:12అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని
సామెతలు 26:24పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
అపొస్తలుల కార్యములు 23:15కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.