1 సమూయేలు 2:10యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
కీర్తనలు 2:5ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును
కీర్తనలు 46:9ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
కీర్తనలు 46:10ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
కీర్తనలు 68:30రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.
కీర్తనలు 72:7అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
కీర్తనలు 82:8దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
కీర్తనలు 96:13భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
కీర్తనలు 98:9భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
కీర్తనలు 110:1ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
కీర్తనలు 110:5ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
యెషయా 2:4ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యెషయా 9:7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
యెషయా 11:3యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
యెషయా 25:3భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.
యెషయా 51:5నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.