Home మత్తయి 8:3 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 8 · Verse 3

తెలుగు బైబిల్

మత్తయి 8:3

అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను.

Book: Matthew · Chapter: 8 · Verse: 3

Cross References

ఆదికాండము 1:3

దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

2 రాజులు 5:11

అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.

2 రాజులు 5:14

అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.

కీర్తనలు 33:9

ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

మత్తయి 11:4

యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి.

మార్కు 1:41

ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.

మార్కు 4:39

అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.

మార్కు 5:41

ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.

మార్కు 7:34

ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.

మార్కు 9:25

జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.

లూకా 5:13

అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.

లూకా 7:14

ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా

లూకా 17:14

ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.

యోహాను 5:21

తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

యోహాను 11:43

ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

యోహాను 15:24

ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme