Home మత్తయి 26:73 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 26 · Verse 73

తెలుగు బైబిల్

మత్తయి 26:73

కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

Book: Matthew · Chapter: 26 · Verse: 73

Cross References

న్యాయాధిపతులు 12:6

అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.

నెహెమ్యా 13:24

వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

లూకా 22:59

ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.

యోహాను 18:26

పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme