Home మత్తయి 24:8 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 24 · Verse 8

తెలుగు బైబిల్

మత్తయి 24:8

అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.

Book: Matthew · Chapter: 24 · Verse: 8

Cross References

లేవీయకాండము 26:18

ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

ద్వితీయోపదేశకాండము 28:59

యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.

యెషయా 9:12

తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 9:17

వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి ¸యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 9:21

మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 10:4

వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

1 థెస్సలొనీకయులకు 5:3

లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

1 పేతురు 4:17

తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme