Home మత్తయి 2:15 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 2 · Verse 15

తెలుగు బైబిల్

మత్తయి 2:15

ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.

Book: Matthew · Chapter: 2 · Verse: 15

Cross References

నిర్గమకాండము 4:22

అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;

సంఖ్యాకాండము 24:8

దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి యెముకలను విరుచునుతన బాణములతో వారిని గుచ్చును.

హోషేయ 11:1

ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచి తిని.

మత్తయి 1:22

ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

మత్తయి 2:17

అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను

మత్తయి 2:19

హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై

మత్తయి 2:23

ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )

మత్తయి 4:14

జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

మత్తయి 8:17

ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.

మత్తయి 12:16

ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

మత్తయి 21:4

ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదే మనగా

మత్తయి 26:54

నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.

మత్తయి 26:56

అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

మత్తయి 27:35

వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

లూకా 24:44

అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

యోహాను 19:28

అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme