Home మార్కు 7:19 · తెలుగు బైబిల్

మార్కు

Chapter 7 · Verse 19

తెలుగు బైబిల్

మార్కు 7:19

అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థము లన్ని టిని పవిత్రపరచును.

Book: Mark · Chapter: 7 · Verse: 19

Cross References

మత్తయి 15:17

నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని

లూకా 11:41

కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.

అపొస్తలుల కార్యములు 10:15

దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.

అపొస్తలుల కార్యములు 11:9

రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండిదేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.

రోమీయులకు 14:1

విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

1 కొరింథీయులకు 6:13

భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

కొలస్సీయులకు 2:16

కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

కొలస్సీయులకు 2:21

మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme