Home లూకా 23:5 · తెలుగు బైబిల్

లూకా

Chapter 23 · Verse 5

తెలుగు బైబిల్

లూకా 23:5

అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

Book: Luke · Chapter: 23 · Verse: 5

Cross References

కీర్తనలు 22:12

వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

కీర్తనలు 22:16

కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

కీర్తనలు 57:4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

కీర్తనలు 69:4

నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.

మత్తయి 4:12

యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

మత్తయి 4:23

యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

మత్తయి 27:24

పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

మార్కు 1:14

యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

లూకా 4:14

అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.

లూకా 11:53

ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి,

లూకా 23:23

అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.

యోహాను 1:43

మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

యోహాను 2:11

గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.

యోహాను 7:41

మరికొందరు ఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

యోహాను 7:52

వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

యోహాను 19:15

అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme