Home లూకా 20:28 · తెలుగు బైబిల్

లూకా

Chapter 20 · Verse 28

తెలుగు బైబిల్

లూకా 20:28

బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను.

Book: Luke · Chapter: 20 · Verse: 28

Cross References

ఆదికాండము 38:8

అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.

ఆదికాండము 38:11

అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.

ఆదికాండము 38:26

యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.

ద్వితీయోపదేశకాండము 25:5

సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

రూతు 1:11

నయోమినా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme