Home లూకా 2:41 · తెలుగు బైబిల్

లూకా

Chapter 2 · Verse 41

తెలుగు బైబిల్

లూకా 2:41

పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.

Book: Luke · Chapter: 2 · Verse: 41

Cross References

నిర్గమకాండము 12:14

కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.

నిర్గమకాండము 23:14

సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచ రింపవలెను.

నిర్గమకాండము 34:23

సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కన బడవలెను

లేవీయకాండము 23:5

మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.

సంఖ్యాకాండము 28:16

మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.

ద్వితీయోపదేశకాండము 12:5

మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను.

ద్వితీయోపదేశకాండము 12:11

నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.

ద్వితీయోపదేశకాండము 12:18

నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.

ద్వితీయోపదేశకాండము 16:1

ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.

ద్వితీయోపదేశకాండము 16:16

ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.

1 సమూయేలు 1:3

ఇతడు షిలోహునందున్న సైన్యముల కధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.

1 సమూయేలు 1:21

ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పిం చుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.

యోహాను 2:13

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి

యోహాను 6:4

అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

యోహాను 11:55

మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.

యోహాను 13:1

తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme