Home లూకా 17:22 · తెలుగు బైబిల్

లూకా

Chapter 17 · Verse 22

తెలుగు బైబిల్

లూకా 17:22

మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.

Book: Luke · Chapter: 17 · Verse: 22

Cross References

మత్తయి 9:15

యేసుపెండ్లి కుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు.

మార్కు 2:20

పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినముల లోనే వారుపవాసము చేతురు.

లూకా 5:35

పెండ్లికుమా రుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.

లూకా 13:35

ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.

యోహాను 7:33

యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;

యోహాను 8:21

మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

యోహాను 12:35

అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.

యోహాను 13:33

పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.

యోహాను 16:5

ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని

యోహాను 16:16

కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.

యోహాను 17:11

నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme